ఖిలావరంగల్, ఫిబ్రవరి 10 : వరంగల్ రైల్వేస్టేషన్‌లోని(Warangal Railway station) ప్రధాన ద్వారం వద్ద ఆర్పీఎఫ్ పోలీసులు గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 312 కిలోల గంజాయిని స్వాధీనం (Marijuana seized)చేసుకున్నారు. వరంగల్ ఆర్పీఎఫ్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్పీఎఫ్ ఎస్ఐ వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ గురవయ్య, కానిస్టేబుల్ మనోజ్‌తోపాటు సీఐబీ కానిస్టేబుల్ సుర్జిత్‌కుమార్ వరంగల్ రైల్వేస్టేషన్‌లోని ప్రధాన ద్వారం వద్ద తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో మహారాష్ట్రలోని ముంబైకి చెందిన రాల్ రాం లఖన్తివారీ (24), ఆశీష్ రమ్నాయక్ యాదవ్ (20) అనుమానాస్పదంగా కనిపించడంతో వారి బ్యాగ్‌లను తనిఖీ చేయగా అందులో 16 ప్యాకెట్లలో 31 కిలోల గంజాయి లభించినట్లు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.7.75 లక్షలు ఉంటుందన్నారు. నిందితులు ఇద్దరిపై చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు టాస్క్ ఫోర్స్ సీఐ శ్రీధర్‌కు అప్పగించినట్లు వారు తెలిపారు.