దామెర: వడదెబ్బతో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..హనుమకొండ పోచమ్మకుంట సగర కాలనీకి చెందిన తాపీ మేస్త్రి వేముల మల్లేశం (46) వడ దెబ్బతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ కొంక అశోక్ శుక్రవారం తెలిపారు. దామెర గ్రామంలో గిద్దలూరి కొమురు ఇంటి నిర్మాణం పని చేసేందుకు గురువారం మృతుడు దామెరకు వెళ్లాడు.
మధ్యాహ్న సమయంలో పని చేస్తుండగా వడ దెబ్బకు గురయ్యాడు. గమనించిన స్థానికులు హాస్పిటల్లో చేర్పించగా చికిత్స పొందుతూ మల్లేశం మృతి చెందాడు. మృతుని భార్య వేముల రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. మల్లేశం మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.