చెన్నారావుపేట : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన చెన్నారావుపేట మండల కేంద్రంలో మంగళవారం ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చెన్నారావుపేట మండల కేంద్రానికి చెందిన మర్రి రాములు (64) వ్యవసాయం, పాలు అమ్ముతూ జీవిస్తున్నాడు. మృతుడు మరో రాములు రోజు మాదిరిగానే గ్రామంలో పాలు పోసి వస్తునాడు. ఈ క్రమంలో గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద నర్సంపేట నుంచి నెక్కొండ వైపు వెళ్తున్న టాటా ఏసీ బండి వేగంగా వచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడు రాములకు భార్య సమ్మక్క కొడుకు కూతురు ఉన్నారు. కాగా, గ్రామంలో ఉన్న ప్రధాన రహదారులపై కూడలి వద్ద స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగి వ్యక్తి మృతి చెందాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చెన్నరావుపేట మండల కేంద్రంలో నాలుగు రోడ్లు కలిసే కూడలి వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.