ఖిలావరంగల్: గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం అర్ధరాత్రి కాజీపేట, వరంగల్ రైల్వేస్టేషన్ల మధ్య జరిగింది. వరంగల్ జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ రవీందర్‌రెడ్డి తెలిపిన కథనం ప్రకారం.. సుమారు (35 )ఏళ్ల వయస్సు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి కాజీపేట, వరంగల్ రైల్వేస్టేషన్ల మధ్యనున్న దర్గా కాజీపేట రైల్వేగేటు సమీపంలో రైలు నెం. 12762 కరీంనగర్ నుంచి తిరుపతి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో తల, మొండం తెగిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడు పెసరు రంగు ప్యాంట్, రెండ్, బ్లాక్ లైన్స్,పింక్ షర్ట్ ధరించి ఉన్నాడు. మృతుడి కుడి చేతికి వైట్ కలర్ బ్యాండేజ్ కట్టిఉంది. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో రైల్వే అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని ఎంజీఎం దవాఖాన మార్కురీలో భద్రపరిచి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మృతుడు ఏదేని దవాఖాన నుంచి వచ్చి ఆత్మహత్యకు చేసుకున్నాడా అనే కోణంలో విచారణ చెపట్టినట్లు హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు వరంగల్ రైల్వే జీఆర్పీ స్టేషన్లో గాని లేదా ఎంజీఎం మార్చురీలో సంప్రదించాలని పేర్కొన్నారు.