బచ్చన్నపేట, జులై 29 : వ్యవసాయ బావి వద్ద పట్టాభూమి నుండి పానాది ఇవ్వాలని కక్షతో నలుగురు వ్యక్తులు ఇంట్లోకి వెళ్లి దాడి చేసిన సంఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని ఇటికాలపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేసిన వివరాల ప్రకారం.. ఇటకాలపల్లి గ్రామానికి చెందిన రైతు
ఆత్కూరి లింగయ్యకు చెందిన 34 గుంటల పట్టాభూమి నుండి పానాదికి భూమి ఇవ్వాలని, గత కొంతకాలంగా రాసూరి ఐలయ్య కుటుంబ సభ్యులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు.
అప్పుడప్పుడు వ్యక్తిగత గొడవలు చేస్తూ బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం పానాది భూమి అడిగితే ఎందుకు ఇవ్వడం లేదని లింగయ్య ఇంట్లోకి రాసూరి ఐలయ్య, యాదవ్వ, రజిత, కిశోర్ చొరబడి నానా దుర్భాషలాడుతూ దాడి చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధిత రైతు ఆత్కూరి లింగయ్య వెల్లడించారు.