వరంగల్ చౌరస్తా: ఎంజీఎం దవాఖాన మార్చురీలో మృతదేహాలను భద్రపరిచేందుకు కొత్త ఫ్రీజర్లను ఏర్పాటు చేయాలని తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్ అధ్యక్షుడు మల్లారెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం అసోసియేన్ ప్రతినిధులు ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ కిశోర్ కుమార్ను కలిసి వినతిపత్రం అందజేశారు. చాలా కాలం నుంచి మార్చురీ ఫ్రీజ్ బాక్స్ లు పని చేయటం లేదని, పదే పదే బాగు చేసినప్పటికీ ఫలితం లేకుండా వెంటవెంటనే మరమ్మతులకు గురవుతున్నాయి. తద్వారా మృతదేహాలు త్వరగా పడిపోతున్నాయని, విద్యార్ధుల వైద్య విద్యకు మృతదేహాలు పని చేయడం లేదన్నారు. మృతదేహాలను ఇంటికి తీసుకు తీసులవేళ్లే సమయంలో సైతం కుటుంబ సభ్యులకు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
మరణానంతరం కుటుంబసభ్యులు నేత్ర దానం చేయడానికి ముందుకు వచ్చినా ఫలితం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తవి ఏర్పాటు చేయాలని ప్రతినిధులు కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఉపేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు కాండ్రెడ్డి మల్లా రెడ్డి, ప్రధాన ప్రధాన కార్యదర్శి ఆడెపు రాజేంద్ర ప్రసాద్, సీనియర్ సిటిజెన్ అసోసియేషన్ హనుమ కొండ జిల్లా ప్రధాన కార్యదర్శి యుగేందర్, తదితరులు పాల్గొన్నారు.