Financial help | ఇటీవల మహబూబాబాద్ జిల్లా మరిపెడ పురపాలక సంఘం పరిధిలో ప్రమాదానికి గురైన బాలిక సమంతకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెకు వైద్య ఖర్చుల నిమిత్తం మరిపెడ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆర్థిక సాయమందించారు. ఈ మేరకు ఇవాళ సంఘం తరపున రూ.12,500 బాలిక కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ.. ఆర్థికంగా వెనుకబడి ఉన్న బాలిక ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం కొంతమేర ఆర్థిక సహాయం చేశామన్నారు.
తీవ్రంగా గాయపడిన సమంత త్వరితగతిన కోలుకోవడానికి దాతలు ఎవరైనా ముందుకొచ్చి తమకు తోచిన సహాయం చేయగలరని చిన్నారి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం సభ్యులు రేఖ అశోక్ యాదవ్, రేఖ రమేష్ యాదవ్, ఉడుగుల రాజు యాదవ్, వెంకన్న, రమేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Rekha Gupta | శీష్ మహల్‌ను మ్యూజియంగా మారుస్తాం : రేఖా గుప్తా
Emergency Landing | దుబాయ్ వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య.. నాగ్‌పూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
KCR | ఏఐజీ హాస్పిటల్‌కు కేసీఆర్.. సాధారణ పరీక్షల కోసమే!