Sanitation Problems | మరిపెడ, జూలై 20: గ్రామాల్లో రోజు రోజుకు ప్రజల సమస్యలు పట్టించుకునేవారే కరువవుతున్నారు. గ్రామాల్లో నెలకొన్న పారిశుధ్య లోపంతో గ్రామాల ప్రజలు, తండాలలో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాలు, తండాల్లో పరిశుభ్రత లోపించి దోమలు స్వైర విహారం చేస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. మురుగు కాలువల్లో క్రిమి సంహారక మందు స్ప్రే చేయడం, ఫాగింగ్ వంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదని ఆరోపిస్తున్నారు.
గ్రామాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తమై మురికి కూపాలుగా మారుతున్నాయి. ప్రత్యేకాధికారుల పాలనలో గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. మురికి కాల్వలను శుభ్రపరచడం, పిచ్చిమొక్కలను తొలగించడం, వీధులను ఊడ్చడం, నీటి ట్యాంకులను శుభ్రం చేయడం, తాగునీటి పైపులైన్ల లీకేజీలను సరిచేయడం లాంటివి అధ్వానంగా తయారైంది.
బురద గుంటలుగా మారిన రోడ్డు..
మరిపెడ మండలంలోని కోట్యి తండాలో మంచి నీళ్ల బోరు 24 గంటలు నడవడంతో నీరు వృథాగా రోడ్డుపై పారి రోడ్డు ధ్వంసం కావడంతో పాటు బురద గుంటలుగా మారింది. తాళ్ళ ఊకల్ రెవెన్యూ పరిధిలోని పాంబండ తండా గ్రామపంచాయితీ నిర్వహణ మరి అద్వానంగా ఉంది. గ్రామపంచాయితీ కార్యాలయం ఆవరణం చెత్త, చెదారంతో నిండి ఉంది. గ్రామపంచాయితీ కార్యాలయం లేదా పాడుబడ్డ భవనంలా ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
అనేపురం రెవెన్యూ ఎలమంచలి తండాలో పరిస్థితి మరి దారుణంగా ఉంది, తండాలో కనీసం మురికి నీరు ప్రవహించడానికి సైడ్ కాల్వలు లేకపోవడంతో వర్షం పడిన నీరు అంతా రోడ్డుపై ఉండంతో తండావాసులు, విద్యార్థులు నడవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా పారిశుధ్య సమస్యలు కొలిక్కి వస్తాయోమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు ఆయా గ్రామాలు, తండావాసులు.
Yellareddypet | పల్లెను మరిచిన ప్రభుత్వం.. గ్రామాల్లో పడకేసిన పారిశుధ్యం..
Siddaramaiah | డీకే శివకుమార్ పేరెత్తిన కార్యకర్త.. తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం సిద్ధరామయ్య
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి