Nagula Gutta | నాగుల గుట్టను తొలుస్తున్న క్వారీ భూతం.. చెల్లాచెదురుగా శిల్పాలు
Nagula Gutta | నాగుల గుట్టపై అపురూప శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. వర్షాలు సంమృద్ధిగా కురవాలని, సంతానం కలగాలని, గ్రామాన్ని పరిరక్షించాలని నాగ దేవత శిల్పాలకు ఎక్కువగా మొక్కులు చెల్లించుకుంటారు. ఒకప్పుడు నిత్య పూజలు అందుకున్న ఆ శిల్పాలు నేడు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
Nagula Gutta | నాగుల గుట్టపై అపురూప శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. వర్షాలు సంమృద్ధిగా కురవాలని, సంతానం కలగాలని, గ్రామాన్ని పరిరక్షించాలని నాగ దేవత శిల్పాలకు ఎక్కువగా మొక్కులు చెల్లించుకుంటారు. ఒకప్పుడు నిత్య పూజలు అందుకున్న ఆ శిల్పాలు నేడు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నారం గ్రామంలో నాగులమ్మ గుట్ట ఉంది. అనాదిగా ఈ గుట్టను నాగులమ్మ గుట్టగానే పిలుస్తారు. ప్రాచీన కాలంలో నాగదేవత శిల్పాలకు ప్రత్యేక ఆరాధనలు ఉండేవి. గుట్టపై ఏడు పడగలతో నాగ దేవత శిల్పం ఒక పక్కన పడేసి ఉంది. ఆ శిల్పం ద్విభుజి. కుడిచేత కత్తి, ఎడమచేత డాలు ధరించిన అర్థ నారీ నాగ శిల్పం. పక్కనే మరో నాగ శిల్పం ఈ విధంగానే ఉంది. మరో రెండు నాగ శిలలు గుట్టపై ఒక బండ రాయికి ఆనించి ఉన్నాయి. గుట్టపై చిన్నపాటి కోనేరు ఉంది. కోరిన కోర్కెలు తీర్చాలని భక్తులు మొక్కులు ముట్టజెప్పే శిలలుగా తెలుస్తుంది.

Nagulagutta2
16వ శతాబ్దంలో ఇటువంటి నాగ శిలలు ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. జగిత్యాల జిల్లా నాగులపేటలో ఇటువంటి నాగ దేవత శిల్పాలు గతంలో పెద్ద ఎత్తున బయటపడ్డాయి. ఈ ప్రాంతంలో తవ్వకాలు జరుపగా దాదాపు 285 వరకు నాగ శిలలు వెలికి తీయబడ్డాయి.
ఇంతటి ఘన చరిత్ర కలిగిన అన్నారం నాగుల గుట్ట ప్రస్తుతం క్వారీ కోరల్లో చిక్కుకుని ఉంది. క్వారీ పనులు ఇప్పుడు జరగకపోయినా క్వారీ ఆనవాళ్లు, చెల్లాచెదురైన బండ రాళ్లు, కూరుకుపోయి ధ్వంసమవుతున్న నాగ శిల్పాలు చూడవచ్చు. చారిత్రక నేపథ్యం కలిగిన ఈ గుట్టపై క్వారీని పూర్తిగా రద్దు చేసి, నాగుల గుట్టను, అక్కడి నాగ శిలలను పరిరక్షించాలని ప్రభుత్వాన్ని, పురావస్తు అధికారులను చరిత్రకారులు ముక్తకంఠంతో కోరుతున్నారు.
గుడికందుల కిషోర్..✍️✍️
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

