NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
NZvIND: భారత్ ఘోరంగా ఓడింది. నాలుగో వన్డేలో న్యూజిలాండ్ జట్టు 244 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. కివీస్ బౌలర్ మ్యాట్ హెన్రీ ఆరు వికెట్లు తీసి భారత్‌ను దారుణంగా దెబ్బతీశాడు. ఇండియా 89 రన్స్‌కే ఆలౌటైంది.
మౌంట్ మౌంగనుయి: భారత్‌తో జరిగిన నాలుగో వన్డే(NZvIND)లో.. న్యూజిలాండ్ జట్టు 244 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో అయిదు వన్డేల సిరీస్‌లో భారత్ ఆధిక్యం 2-1తో నిలిచింది. కివీస్ బౌలర్ మ్యాట్ హెన్రీ నాలుగో వన్డేలో షాకిచ్చాడు. తొలి ఓవర్లోనే అతను ముగ్గురు బ్యాటర్లను డకౌట్ చేసి ఇండియా ఆశల్ని దెబ్బతీశాడు. సూపర్ బౌలింగ్‌తో ఆకట్టుకున్న హెన్రీ.. ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 333 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కివీస్ బ్యాటర్ యంగ్ అత్యధికంగా 125 రన్స్ చేసి ఔటయ్యాడు. అయితే ఛేజింగ్‌లో భారత్ చితికిల పడింది. హెన్రీ తన ఫస్ట్ ఓవర్లోనే రోహిత్, కోహ్లీ, అయ్యర్‌లను డకౌట్ చేశాడు. ఇక ఆ తర్వాత ఇండియా కోలుకోలేకపోయింది. ఇషాన్ కిషన్ అత్యధికంగా 27 రన్స్ చేశాడు. అక్షర్ 21, నమన్ 21 రన్స్ చేసినా.. ఇండియా క్రమంగా వికెట్లను కోల్పోయింది. భారీ లక్ష్య చేధనలో వెనుకబడ్డ భారత్.. 26.4 ఓవర్లలో 89 రన్స్‌కే ఆలౌటైంది.
భారీ తేడాతో భారత్ ఓడడం చాన్నాళ్ల తర్వాత చోటుచేసుకున్నది. వన్డే మ్యాచ్‌లో చివరిసారి 2000 అక్టోబర్‌లో శ్రీలంక చేతిలో ఇండియా 245 రన్స్ తేడాతో ఓటమి చవిచూసింది. 26 ఏళ్ల తర్వాత మళ్లీ ఇవాళ భారీ తేడాతో ఓడింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- India
- Matt Henry
- New Zealand
- NZvIND
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
Mysaa | టాలీవుడ్లో మరో వాయిదా.. రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ మారనుందా?
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
Zakir Naik: జకీర్ నాయక్‌పై నిషేధం మరో అయిదేళ్లు పొడిగింపు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

