Mysaa | టాలీవుడ్లో మరో వాయిదా.. రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ మారనుందా?
Tollywood Movie | టాలీవుడ్లో సినిమాల వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలు భారీ మరియు మధ్యతరహా చిత్రాలు అనుకున్న తేదీలకు రాలేకపోతుండగా, తాజాగా ఆ జాబితాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ మూవీ 'మైసా' కూడా చేరినట్లు ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
Tollywood Movie | టాలీవుడ్లో సినిమాల వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలు భారీ చిత్రాలు అనుకున్న తేదీలకు రాలేకపోతుండగా, తాజాగా ఆ జాబితాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ మూవీ ‘మైసా’ కూడా చేరినట్లు ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో రష్మిక తొలిసారిగా ఒక గిరిజన యువతిగా మైసా అనే ఛాలెంజింగ్ పాత్రలో కనిపించనున్నారు. తన జాతికి జరిగిన అన్యాయంపై పోరాడే ఈ పాత్ర కోసం ఆమె ప్రత్యేకంగా మార్షిల్ ఆర్ట్స్‌లో శిక్షణ కూడా తీసుకున్నారు. డూప్ లేకుండా రిస్కీ ఫైట్ సీక్వెన్స్‌లలో నటించినట్లు ఇటీవల విడుదలైన టీజర్ ద్వారా స్పష్టమైంది. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రష్మిక కెరీర్లోనే బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్‌గా మారుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
అయితే, ముందుగా ఈ సినిమాను నవంబర్ 27న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో ఈ విడుదల తేదీ మారే అవకాశం ఉందని తెలుస్తోంది. నవంబర్ 27కి బదులుగా సరిగ్గా వారం రోజులు ఆలస్యంగా డిసెంబర్ 4న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ యోచిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై సినిమా నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం వ్యక్తిగత కారణాల వల్ల విదేశీ టూర్లో ఉన్న రష్మిక, ఆ ప్రయాణం ముగిసిన వెంటనే సినిమా ప్రమోషన్లలో వేగం పెంచనున్నారు. రావు రమేష్, సముద్రఖని, గురు సోమసుందరం, ఈశ్వరీ రావు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mysaa | టాలీవుడ్లో మరో వాయిదా.. రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ మారనుందా?
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
Zakir Naik: జకీర్ నాయక్‌పై నిషేధం మరో అయిదేళ్లు పొడిగింపు
Mukhra Womens Protest | హైదరాబాద్‌కు వస్తున్న రాహుల్‌గాంధీకి ముఖ్రా మహిళల నిరసన
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

