Zakir Naik: జకీర్ నాయక్‌పై నిషేధం మరో అయిదేళ్లు పొడిగింపు
Zakir Naik: వివాదాస్పద ఇస్లామిక్ మత ప్రబోధకుడు జకీర్ నాయక్‌కు చెందిన ఇస్లామిక్ రీసర్చ్ ఫౌండేషన్ సంస్థపై నిషేధాన్ని కేంద్ర హోంశాఖ మరో అయిదేళ్ల పాటు పొడిగించింది. దేశ భద్రతకు భంగం కలిగించే అంశాల్లో ఆ సంస్థ కార్యకలాపాలు ఉన్నట్లు కేంద్రం పేర్కొన్నది.
న్యూఢిల్లీ: వివాదాస్పద ఇస్లామిక్ మత ప్రబోధకుడు జకీర్ నాయక్(Zakir Naik)కు చెందిన ఇస్లామిక్ రీసర్చ్ ఫౌండేషన్ సంస్థపై నిషేధాన్ని కేంద్ర హోంశాఖ మరో అయిదేళ్ల పాటు పొడిగించింది. దేశ భద్రతకు భంగం కలిగించే అంశాల్లో ఆ సంస్థ కార్యకలాపాలు ఉన్నట్లు కేంద్రం పేర్కొన్నది. శాంతి, మత సామర్యానికి ఆ సంస్థ వల్ల విఘాతం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు కేంద్ర హోంశాఖ చెప్పింది. యూఏపీఏ చట్టంలోని సెక్షన్ 3లోని సబ్‌సెక్షన్ 1 కింద ఐఆర్ఎఫ్ను చట్టవ్యతిరేక సంస్థగా హోంశాఖ ప్రకటించింది. యూఏపీఏ ట్రిబ్యునల్ దీనికి ఆమోదం తెలిపింది. గతంలో విధించిన బ్యాన్ నవంబర్ 14వ తేదీన ముగియనున్నది. ఐఆర్ఎఫ్, దాని సభ్యులు, ముఖ్యమంగా ఆ సంస్థ వ్యవస్థాపకుడు జకీర్ నాయక్.. తన మద్దతుదారులను రెచ్చగొడుతున్నారని, సమాజంలో మతోన్మాదాన్ని సృష్టించే రీతిలో జకీర్ చర్యలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
జకీర్ చేసిన వ్యాఖ్యలు, ప్రసంగాలు అభ్యంతరకరంగా ఉన్నట్లు కేంద్రం భావిస్తోంది. విభిన్న మత వర్గీయుల మధ్య తన ప్రసంగాలతో విద్వేషాన్ని సృష్టిస్తున్నట్లు జకీర్ ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉన్న అభిమానులను టీవీ నెట్వర్క్, ఇంటర్నెట్, ప్రింట్, సోషల్ మీడియా ద్వారా తన ప్రసంగాలతో రాడికలైజ్ చేస్తున్నట్లు కేంద్రం తన గెజిట్‌లో పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Zakir Naik: జకీర్ నాయక్‌పై నిషేధం మరో అయిదేళ్లు పొడిగింపు
Mukhra Womens Protest | హైదరాబాద్‌కు వస్తున్న రాహుల్‌గాంధీకి ముఖ్రా మహిళల నిరసన
Realme | రియల్మీ ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. నవంబర్ 16 నుంచి కొత్త విధానం అమల్లోకి!
Digital Dashboard | కేంద్రీయ విద్యాలయ డిజిటల్ డ్యాష్‌బోర్డ్‌ను ప్రారంభించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి
Wildlife Protect | వన్యప్రాణులను కాపాడుకోవడం అందరి బాధ్యత
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

