Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
మహబూబ్‌నగర్ : విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ( Show cause notices ) జారీ చేయాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ( Madhusudan Naik ) సంబంధిత అధికారులను ఆదేశించారు. జడ్చర్ల మండలం నస్రుల్లాబాద్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ( HM )తో పాటు ఆరుగురు ఉపాధ్యాయులు( Teachers ) ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనట్లు గుర్తించారు. దీనిపై అదనపు కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, విధులకు గైర్హాజరైన ప్రధానోపాధ్యాయుడు, ఆరుగురు ఉపాధ్యాయులకు వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు, సమయపాలన విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వరాదని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల పనితీరుపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
Kangana Ranaut | 17 ఏండ్ల తర్వాత టాలీవుడ్లోకి కంగనా రనౌత్.. రవిబాబు దర్శకత్వంలో క్రేజీ హారర్
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
Mysaa | టాలీవుడ్లో మరో వాయిదా.. రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ మారనుందా?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

