కురవి, ఫిబ్రవరి 13: రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థానిక సంస్థల ఎన్నికలు పెడుతాడనే నమ్మకం లేకుండా పోతున్నది. పెడితే ఓట్లు మనవే..సీట్లు మనవే అని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ (Redya Naik) అన్నారు. కురవి మండల కేంద్రంలోని ఓం ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ మండల స్థాయి విస్తృత సమావేశం మండల పార్టీ అధ్యక్షుడు తోట లాలయ్య అధ్యక్షతన గురువారం జరిగింది. ఈ సందర్భంగా రెడ్యానాయక్ మాట్లాడుతూ.. 420 అమలు గాని హామీలను చెప్పి అధికారంలోకి వచ్చి కనీసం ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు.
ఇప్పటి వరకు ఒక్క పథకం ప్రారంభించలేదని విమర్శించారు. ఇందిరమ్మ ఇండ్లు రావు..వచ్చిన బిల్లులు రావు రాసి పెట్టుకోండని స్పష్టం చేశారు. మహిళలు కోపం ఉన్నారని స్థానిక సంస్థల ఎన్నికల్లో వారి తడాఖా చూపిస్తారన్నారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. కాళేశ్వరంలో నీల్లున్నాయి. రైతుల గురించి ఆలోచించే వారైతే ఆ నీటితో చెరువులను ఎందుకు నింపడం లేదని ప్రశ్నించారు. సీఎం నోటికి చిన్నా పెద్దా తేడా లేదు.. కేసీఆర్ తెలంగాణ తేకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేటోడా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు అదృష్టవంతులని, వచ్చే ఎన్నికల్లో ఖర్చు లేకుండా గెలుస్తారని జ్యోస్యం చెప్పారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఒకటో రెండో అధికార పార్టీకి వచ్చేవవి.
కానీ, ఎంత ఆలస్యం చేస్తే బీఆర్ఎస్కు అంత మంచిదన్నారు. ఐక్యంగా కలిసి మెలిసి ఉండాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. దోచుకో దాచుకో అన్న రీతిగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల తీరు మారిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు బజ్జూరి పిచ్చిరెడ్డి, యూత్ రాష్ట్ర నాయకులు గుగులోత్ రవినాయక్, కురవి సొసైటీ చైర్మన్ దొడ్డ గోవర్ధన్ రెడ్డి, అయూబ్, బాదె నాగయ్య, ఐలి నరహరి, నెహ్రూ నాయక్, కిశోర్ వర్మ, కొణతం విజయ్, రాజు నాయక్, రామచంద్రయ్య, గణేష్, చంద్రారెడ్డి, కృష్ణమూర్తి, యానాల గంగాధర్ రెడ్డి, వినోద్, రమేష్, గణేష్, సూర్య, నామ సైదులు, రొయ్యల నాగేశ్వరరావు, రాంలాల్, గుండోజు శ్రీనివాస్, అమ్రీ, బత్తుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.