నర్సింహులపేట, మార్చి 27 : సైబర్ నేరగాళ్లు కాజేసిన డబ్బును రికవరీ చేసి బాధితుడికి పోలీసులు అప్పగించారు. నర్సింహులపేట మండలానికి చెందిన ఎస్బీఐ మినీ బ్యాంక్ నిర్వాహకుడు గుగులోతు రమేశ్ నుంచి సైబర్ నేరగాళ్లు కాజేసిన డబ్బు రూ.80 వేలను పోలీసులు గురువారం రికవరీ చేశారు. వివరాల్లోకి వెళ్తే..బాధితుడు మూడు నెలల క్రితం పోలీసులమని చెప్పి రమేశ్ దగ్గర నుంచి 80,000 ఫోన్ పే చేయించుకున్నారు. మోసపోయానని తెలుసుకున్న రమేశ్ వెంటనే సైబర్ క్రైమ్ 1930 పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించి సైబర్ నేరగాళ్ల ఖాతాలను స్తంభింపజేసి డబ్బును రికవరీ చేశారు. సాంకేతిక ఆధారాల ద్వారా సైబర్ నేరస్థులు డబ్బును ఏ ఖాతాలకు మళ్లించారో గుర్తించి ఆ ఖాతాలను ఫ్రీజ్ చేశారు. లీగల్ ప్రొసీడింగ్స్ పూర్తి చేసి నగదును బాధితుల ఖాతాల్లో జమ చేశారు.
డబ్బును రికవరీ చేసి అప్పగించిన పోలీసులకు గుగులోతు రమేశ్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు. కాగా, సైబర్ నేరగాళ్లు పోగుట్టుకున్న డబ్బును సకాలంలో ఫిర్యాదు చేయడం వల్ల నేరగాళ్ల ఖాతాను సీజ్ చేసి డబ్బును రికవరీ చేసే అవకాశం ఉంటుందని ఎస్ఐ మాలోత్ సురేష్ సూచించారు. బాధితులు వారి ఖాతాలో డబ్బులు పోగొట్టుకున్నట్లయితే ఆలస్యం చేయకుండా 1930కి డయల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ప్రజలు సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ సూచించారు.