మరిపెడ : యువత(youth) ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారపడకుండా వ్యాపార రంగంలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు అన్నారు. శుక్రవారం పురపాలక సంఘం పరిధిలోని బానోతు శాంతి, మల్సూర్ దంపతులు నూతనంగా ఏర్పాటుచేసిన శాంతి ఐరన్ హార్డ్వేర్ షాపును ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా గుడిపూడి నవీన్ రావు మాట్లాడుతూ స్వయం ఉపాధితో పాటు మరికొందరికి ఉపాధి కల్పించాలన్నారు.
యువత తమకు నచ్చిన రంగాలలో శిక్షణ తీసుకున్నట్లయితే బ్యాంకులో రుణాలను మంజూరు చేస్తుందని తద్వారా చిన్న, మధ్యతరహా, భారీ వ్యాపారాలను చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. యువత నేటి కాలానుగుణంగా అన్ని అన్ని రకాల నైపుణ్యాలను కలిగి ఉండాలని, యువత తమలో ఉన్న నైపుణ్యాలను వెలికి తీసి తమకు నచ్చిన రంగాలలో రాణించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కాలు నాయక్, హరి నాయక్, మునేష్, అలవాల ఉపేందర్, బానోతు రాములు, మంగమ్మ, యాకూబ్, వసంత్ తదితరులు పాల్గొన్నారు.