కురవి, ఫిబ్రవరి 24: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కురవి మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. మాజీ జడ్పీటీసీ కొణతం కవిత, కాంపల్లి సొసైటీ చైర్ పర్సన్ కొండపల్లి శ్రీదేవి, అమ్రీ బాయి, లక్ష్మీ రాజు నాయక్ తదితరులు మంగళ హారతితో స్వాగతం పలికారు. నేరడ క్రాస్ రోడ్డులోని అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. చెంచు గిరిజన కోలాటం నృత్య కళాకారులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరుకాగా, ర్యాలీగా వీరభద్ర స్వామి ఆలయ దర్శనానికి బయలుదేరారు. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ ఎమ్మెల్సీ కవిత ఉత్సాహంగా కదిలారు.
స్వామివారికి ప్రత్యేక పూజలు
మండల కేంద్రంలోని భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామిని కవిత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు డీఎస్ రెడ్యానాయక్, బానోత్ శంకర్ నాయక్ లతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి, ఆశీర్వచనం తెలిపారు. అనంతరం స్వయంభు అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు బజ్జూరి పిచ్చిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు తోట లాలయ్య, బీఆర్ఎస్ యూత్ రాష్ట్ర నాయకులు గుగులోతు రవి, జాగృతి రాష్ట్ర నాయకులు సంగెం హర్షిత్ కుమార్, నూతక్కి నరసింహారావు, యతిరాజ్, కురవి మాజీ ఉప సర్పంచ్ సంగెం భరత్, రమాదేవి, వీరన్న, కొణతం విజయ్, దొంగలి నరసయ్య, బోజు నాయక్, గంగాధర్ రెడ్డి, యతిరాజ్, కిన్నెర మల్లయ్య, ఇరుగు వెంకన్న, మూడు శ్రీను, డోర్నకల్ బీఆర్ఎస్ నాయకులు డీఎస్ బాలు, కత్తెరశాల విద్యాసాగర్, ఐలి నరహరి, బోడ శ్రీను, నెహ్రూ నాయక్, కిశోర్ వర్మ తదితరులు పాల్గొన్నారు.