మహబూబాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 36 లక్షల మందికి అన్ని రకాల పెన్షన్లను అందిస్తుందని, మరో 10 లక్షల మందికి నూతన పెన్షన్లను లబ్ధిదారులకు మంజూరు చేసిందని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. గూడూరు మండలం కొల్లాపూర్, బ్రాహ్మణపల్లి, ఏపూర్, మచర్ల, గ్రామాలకు చెందిన 197మంది లబ్ధిదారులకు పెన్షన్ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎశంకర్ నాయక్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 50 లక్షల మంది వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు, ఒంటరి మహిళలలకు ఆసరా పింఛన్లు అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు.
పింఛన్ రానివారు అధ:ర్యపడవద్దని, అర్హులైన వారందరికి ఆసరా పెన్షన్స్ వస్తాయన్నారు. అప్లై చేసుకోని వారు ఉంటే చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ బానోత్ సుజాత , జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ ఖాసీం, వైస్ ఎంపీపీ ఆరె వీరన్న, మండల అధ్యక్ష, కార్యదర్శులు వెంకటకృష్ణా రెడ్డి, నూకల సురేందర్ తదితరులు పాల్గొన్నారు.