మహబూబాబాద్ : ఆసరా పింఛన్లతో ఎంతో మంది నిరుపేదలకు ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. గూడూరు మండలం బొద్డుగొండ, దామరవంచ గ్రామాలలో లబ్ధిదారులకు పెన్షన్ కార్డులను అందజేసి మాట్లాడారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా పెద్ద మొత్తంలో పింఛన్లు అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. పెన్షన్ రానివారు అధైర్యపడవద్దని అర్హులైన వారందరికి పెన్షన్స్ వస్తాయన్నారు.
అర్హులై ఉండి పెన్షన్ రాని వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
కార్యక్రమంలో ఎంపీపీ సుజాత, బి.భరత్ కుమార్ రెడ్డి, జెడ్పీకో ఆప్షన్ ఖాసీం, వెంకట్ కృష్ణా రెడ్డి, సురేందర్, ఆరే వీరన్న, కిషన్, లక్ష్మణ్ రావు, తదితరులు పాల్గొన్నారు.