మహబూబాబాద్ : రాష్ట్రంలో 50 లక్షల పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర మని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. గురువారం కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలో లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ కార్డుల పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పింఛన్లు మంజూరు చేశారన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ చంద్ర మోహన్, జెడ్పీటీసీ రావుల శ్రీనాథ్ రెడ్డి, సర్పంచ్ జల్లే సైదమ్మ, జర్పుల సంధ్య, వైస్ ఎంపీపీ నవీన్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, వెంకన్న, నజీర్ అహ్మద్, కముటాం శ్రీను, యాకుబ్ రెడ్డి, సూరయ్య, తదితరులు పాల్గొన్నారు.