Mhabubabad : ఆర్టీసీ బస్, లారీ ఢీ.. పలువురికి గాయాలు

తొరూరు : తొరూరు డివిజన్ కేంద్రంలోని టీచర్స్ కాలనీ బీవోఐ బ్యాంక్ సమీపంలో బుధవారం సాయంత్రం ఆర్టీసీ బస్, లారీ ఢీకొన్నాయి. వరంగల్-ఖమ్మం ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటు చేసుకోవడంతో సుమారు గంట పాటు ట్రాఫిక్ జాం అయింది. హైదరాబాద్ జగద్గిర్గుట్ట నుంచి నందనం, వర్ధన్నపేట మీదుగా తొరూరుకు వస్తున్న తొరూరు డిపోకు చెందిన బస్ ఖమ్మం వైపు నుంచి వరంగల్‌కు వెళ్తున్న కంటైనర్ లారీ ఎదురేదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో డ్రైవర్ శ్రీనివాస్‌కు కాలు విరుగగా, కండక్టర్‌కు గాయాలయ్యాయి.
బస్సులో ప్రయాణిస్తున్న నెల్లికుదురు మండలం ఎరబెల్లిగూడెం గ్రామానికి చెందిన కె. శ్రీనివాస్, కె. అనంత, హరిపిరాల అమర్సింగ్తండాకు చెందిన హెచ్. పద్మలకు గాయాలు కాగా వీరితో పాటు మరో ఏడుగురు ప్రయాణికులకు స్వల్పంగా దెబ్బలు తగిలాయి. డ్రైవర్, కండక్టర్‌తో పాటు మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని డిపో మేనేజర్ రమేశ్ పరామర్శించారు. రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతంలో ట్రాఫిక్ జాం కావడంతో ఎస్సై గండ్రాతి సతీశ్ ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

