Plastic Currency | దేశంలో త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ.. ట్రయల్స్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
Plastic Currency | దేశంలో త్వరలో ప్లాస్టిక్ లేదా పాలిమర్ కరెన్సీ నోట్స్ (Plastic or Polymer Currency Notes) అందుబాటులోకి రానున్నాయి. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం (Union Govt) కీలక ముందడుగు వేసింది. రూ.10, రూ.20 విలువ కలిగిన ప్లాస్టిక్ లేదా పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రయోగాత్మకంగా పరీక్షిద్దామని భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
Plastic Currency : దేశంలో త్వరలో ప్లాస్టిక్ లేదా పాలిమర్ కరెన్సీ నోట్స్ (Plastic or Polymer Currency Notes) అందుబాటులోకి రానున్నాయి. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం (Union Govt) కీలక ముందడుగు వేసింది. రూ.10, రూ.20 విలువ కలిగిన ప్లాస్టిక్ లేదా పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రయోగాత్మకంగా పరీక్షిద్దామని భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి (Union Finance Minister) పంకజ్ చౌదరి (Pankaj Choudhary) సోమవారం లోక్‌సభ (Lok Sabha) లో ఒక లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.
ఈ ప్రయోగాల్లో భాగంగా రూ.10, రూ.20 డినామినేషన్లలో వంద కోట్ల చొప్పున పాలిమర్ నోట్లను ఆర్బీఐ జారీ చేయనుంది. భారతీయ వాతావరణ పరిస్థితుల్లో ఈ నోట్ల మన్నిక, పనితీరును పరిశీలించడమే ఈ క్షేత్రస్థాయి పరీక్షల ప్రధాన ఉద్దేశం. ఈ ప్రయోగాలు విజయవంతమైతేనే వీటిని దేశవ్యాప్తంగా విస్తృతస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడంపై తుది నిర్ణయం తీసుకుంటారు. అయితే, ప్లాస్టిక్ పాలిమర్ నోట్లను ప్రవేశపెడుతున్నంత మాత్రాన ప్రస్తుతం చలామణిలో ఉన్న కాగితపు నోట్లను రద్దుచేసే ప్రతిపాదన ఏదీ లేదని ప్రభుత్వం స్పష్టంచేసింది.
కాగితపు నోట్లతో పాటే పాలిమర్ నోట్లు కూడా సమాంతరంగా చెలామణిలో ఉంటాయని మంత్రి వివరించారు.
సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్లు ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉంటాయని, ఇవి సులభంగా పాడవవని ఆర్బీఐ పేర్కొన్నది. ముఖ్యంగా తక్కువ విలువ కలిగిన నోట్లు త్వరగా చిరిగిపోతుండటంతో వాటిని తరచూ మార్చాల్సి వస్తోంది. పాలిమర్ నోట్ల వినియోగంవల్ల ముద్రణ, నిర్వహణ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

