The Paradise | టాలీవుడ్ స్టార్ యాక్టర్ నాని (Nani) నటిస్తోన్న చిత్రం ది ప్యారడైజ్ (THE PARADISE). దసరా ఫేం శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో మోహన్ బాబు, తనికెళ్లభరణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ది ప్యారడైజ్ నుంచి మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన నాని, మోహన్ బాబు పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 24న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆసక్తికర వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
సెన్సార్ కాపీతో మ్యూజిక్ సంబంధించిన పనుల కోసం నాని టీం చెన్నైకి వెళ్లనుందట. అనిరుధ్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మరోసారి తన బీజీఎం, మ్యూజిక్‌తో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయడం చాలా ముఖ్యం. ఈ లెక్కన సినిమాను అనుకున్న సమయానికి అంచనాలకు తగ్గకుండా విడుదల చేయాలంటే ది ప్యారడైజ్ టీంకు ఈ 10 రోజుల సమయం చాలా కీలకమన్నమాట.
ఈ జాగా మనదే.. అంటూ షురూ అయిన ది ప్యారడైజ్ టీజర్లో మే ప్యారే ప్యారడైజ్ వాసియో అంటూ మోహన్ బాబు స్టైలిష్ ఎంట్రీ ఇవ్వగా.. సర్కార్ ఉన్నది ఈ దొరల కోసమా..? జనం కోసమా..? అంటూ సాగే సంభాషణలు.. మరోవైపు చీ అని చీదరించుకునే నలుపురంగే మన జెండా.. కాకే దాని మీద గుర్తు అంటూ..నాని ఓ జాతికి నాయకత్వం వహించే నాయకుడిగా అదిరిపోయే యాక్టింగ్‌తో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని టీజర్ చెప్పకనే చెబుతోంది.
ది ప్యారడైజ్‌లో నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటి సోనాలి కులకర్ణి కీ రోల్లో నటిస్తుండగా.. కిల్ ఫేం రాఘవ్ జుయల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్లో దసరా ఫేం సుధాకర్ చెరుకూరి తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Walking vs Yoga | నడక మంచిదా.. యోగా మంచిదా? మీ ఆరోగ్యానికి ఏది సరైనదో తెలుసుకోండి