గూడూరు మార్చి 17: ఇసుక రేట్లు భవన నిర్మాణ కార్మికులకు పని లభించక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని తాపీ మేస్త్రీల సంఘం మండల అధ్యక్షుడు చెల్పూరి శ్రీశైలం అన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 20వ తేదీన కలెక్టరేట్ ముందు చేపట్టబోయే ధర్నా కార్యక్రమ కరపత్రాన్ని మండల కేంద్రంలోని తాపీ మేస్త్రి కార్యాలయం వద్ద సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీశైలం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఇసుక పాలసీ నిర్ణయంతో టన్నుకు వెయ్యి రూపాయలు లభించాల్సిన ఇసుక నేడు టన్నుకు 1700 రూపాయలకు పెరిగి పేద, మధ్యతరగతి ప్రజలు ఇండ్ల నిర్మాణాలను చేసుకునే పరిస్థితి లేదన్నారు.
దీంతో తమకు ఉపాధి దొరకని పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. ఇసుకను ఉచితంగా సరఫరా చేయాలన్నారు. అలాగే కార్మికులకు పెన్షన్ విధానం, గృహ వసతి అమలు చేయాలని కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్ లు అందించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దావాఖాన సమీపంలో ఉన్న సిఐటియు కార్యాలయం నుండి ఈ నెల 20న ర్యాలీ నిర్వహిస్తామ తెలిపారు. కార్యక్రమంలో తాపీ మేస్త్రీలు ఎండీ అంకూస్, సట్ల వెంకన్న, కె.లక్ష్మీనారాయణ, ఎర్ర యాకూబ్, నాంపల్లి వెంకన్న, దయ్యాల ఉపేందర్, జానీ, రత్నం, కొంకటి బాబు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.