మహబూబాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తుందని మానుకోట ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. బుధవారం పట్టణంలోని టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు యాళ్ల మురళీధర్‌రెడ్డి ఆయన మేనమామ సురేందర్‌రెడ్డి ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స తీసుకున్నారు. దవాఖానలో ఎక్కువ మొత్తంలో ఖర్చు కావడంతో ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. సీఎం సహాయనిధి నుంచి రూ. 3లక్షల మంజురు అయ్యాయి.
మంజురైన చెక్కును ఎమ్మెల్యే శంకర్‌నాయక్, రాష్ట్ర కార్యదర్శి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ ఇన్చార్జి నూకల నరేష్‌రెడ్డితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రతి ఒక్కరిని ఆదుకుంటుందని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, వైస్ చైర్మన్ ఎండీ. ఫరీద్, సుధగాని మురళీ, దండెబోయిన వెంకన్న పాల్గొన్నారు.