న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12 : ఈ-కామర్స్ దిగ్గజాల్లో ఒకటైన ఫ్లిప్కార్ట్.. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ విభాగంలోకి అడుగుపెట్టబోతున్నది. పైలెట్ ప్రాజెక్టు కింద వచ్చే మే లేదా జూన్ నెలలో బెంగళూరులో ప్రారంభించే యోచనలో ఉన్నది. ఆ తర్వాతి క్రమంలో ఈ ఏడాది చివరినాటికి లేదా వచ్చే ఏడాది తొలి నెలల్లో దేశవ్యాప్తంగా విస్తరించాలనుకుంటున్నది. ఈ విభాగంలోకి అడుగుపెట్టాలని గతంలోనే ప్రయత్నాలు చేసి విరమించుకున్నది.
మళ్లీ ఇప్పుడు ఈ నూతన సేవలు అందించడానికి ప్రత్యేక టీఎంను నియమించుకునేందుకు కసరత్తును ప్రారంభించింది. దీనిపై కంపెనీ వర్గాలు స్పందించడానికి నిరాకరించారు. దేశీయంగా ఫుడ్ డెలివరీ మార్కెట్ అంచనాలకుమించి వృద్ధిని నమోదు చేసుకుంటున్నది. ప్రస్తుతం 9 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న ఈ మార్కెట్ 2029-30 నాటికి 25 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.