హైదరాబాద్, ఆగస్టు 2(నమస్తే తెలంగాణ): ఈ సీజన్లో ఉచిత చేపపిల్లల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం రూ.116 కోట్లు అదనంగా విడుదల చేస్తూ (బీఆర్వో) ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి బడ్జెట్లో రూ.18.94 కోట్లు మాత్రమే కేటాయించిన ప్రభుత్వం.. తాజాగా మరో రూ.116 కోట్లు మంజూరు చేసింది. దీంతో ఉచిత చేప పిల్లల పంపిణీకి మొత్తంగా రూ.134.94 కోట్లు కేటాయించినైట్లెంది. ప్రభుత్వం బీఆర్వో అయితే ఇచ్చిందిగానీ ఈ నగదు మత్స్యశాఖ ఖాతాలో ఎప్పుడు జమవుతాయో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.