ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమం ఈ ఏడాది ప్రారంభంలోనే టెండర్ల ప్రక్రియ వద్ద అడ్డంకులు ఎదుర్కొంటున్నది. టెండర్లకు స్పందన కనిపించలేదు. బకాయిలు విడుదల కాకపోవడంతో ఎవరు ముందుకు రాలేదు.
చేప, మంచినీటి రొయ్య పిల్లల ఉచిత పంపిణీపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. సీజన్ పూర్తి కావొస్తున్నా పథకంపై సరైన దృష్టి పెట్టడంలేదు. చేపపిల్లల పంపిణీ లక్ష్యం సగమే పూర్తి కాగా, కొన్ని జిల్లాల్లో మొదలే