Asian Games : పద్దెనిమిదో ఆసియా క్రీడల్లో మరో భారత రెజ్లర్ పతకం సాధించాడు. పురుషుల 97కిలోల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్‌లో సత్తా చాటిన దీపక్ పూనియా (Deepak Punia) చరిత్రాత్మక కాంస్యం ముద్దాడాడు. శనివారం జరిగిన పోరులో ఉడుంపట్టుతో అతడు మంగోలియాకు చెందిన ఘన్కుయగ్ గన్బాతర్ను మట్టికరిపించాడు. తద్వారా ఈ విభాగంలో 60 ఏళ్ల పతక నిరీక్షణకు తెరదించాడు దీపక్.
గత ఆసియాడ్‌లో పతకంతో మెరిసిన దీపక్ పూనియా ఈసారి అదరగొట్టాడు. మూడేళ్ల క్రితం హంగ్జౌలో 83 కిలోల కేటగిరీలో వెండి వెలుగులు విరజిమ్మిన అతడు.. ఐచీ నగోయలో కంచు మోతతో యావత్ భారతావని గర్వపడేలా చేశాడు. పురుషుల 97 కిలోల విభాగంలో సత్తా చాటిన దీపక్ ఫైనల్లో ఘన్కుయగ్ గన్బాతర్(మంగోలియా)పై 2-1తో పైచేయి సాధించాడు. దాంతో.. 1966లో భిమ్ సింగ్ అనంతరం ఈ కేటగిరీలో పతకం గెలిచిన రెజ్లర్‌గా నిలిచాడు. అరవై ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ కాంస్యంను ముద్దాడిన దీపక్.. పోడియం మీద మువ్వన్నెల జెండా మురిసిపోయాడు.
Deepak Punia adds another one to the tally! 🥉
Wrestler Deepak Punia wins Bronze in Men’s Freestyle 97 kg at the #AsianGames2026, adding another medal to India’s tally.
VC: Sony LIV#TeamIndia #Cheer4Bharat pic.twitter.com/45VWGbnUf5
— MyGovIndia (@mygovindia) October 3, 2026
దీపక్ పూనియా కంటే ముందు రెజ్లర్లలో ముగ్గురే ఆసియాడ్‌లో 97 కిలోల విభాగంలో పతకం సాధించారు. 1962లో మారుతి మనే స్వర్ణం గెలుపొందగా, గణ్‌పత్ అందల్కర్ వెండితో మెరిశాడు. 1966 ఎడిషన్‌లో బిష్వంత్ సింగ్ సిల్డర్ మెడల్ కొల్లగొట్టగా.. భిమ్ సింగ్ కాంస్యం పట్టేశాడు. ఈసారి దీపక్ కాంస్యంతో 18వ ఎడిషన్‌లో భారత్ ఖాతాలో 83వ పతకం (20 స్వర్ణాలు, 26 రజతాలు, 37 కాంస్యాలు) చేరింది.