Flydubai | ఫ్లైదుబాయ్ విమానంలో పైలట్‌పై కోపైలట్ దాడి ఉగ్రవాదుల చర్యే..!
Flydubai | ఫ్లైదుబాయ్ (Flydubai) విమాన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దుబాయ్ (Dubai) నుంచి టెల్ అవీవ్ (Tel Aviv) వెళ్తున్న విమానంలో భారత పైలట్ (Indian Pilot), కెప్టెన్ స్మిత్ మచ్చర్ (Smit Muccher) పై సహ పైలట్ హమామ్ అల్ హమామీ జరిపిన దాడి ఒక "ఉగ్రవాద చర్య (Terrorist Act)" అని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రాసిక్యూటర్లు (UAE Procecuters) శనివారం ధృవీకరించారు.
Flydubai : ఫ్లైదుబాయ్ (Flydubai) విమాన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దుబాయ్ (Dubai) నుంచి టెల్ అవీవ్ (Tel Aviv) వెళ్తున్న విమానంలో భారత పైలట్ (Indian Pilot), కెప్టెన్ స్మిత్ మచ్చర్ (Smit Muccher) పై సహ పైలట్ హమామ్ అల్ హమామీ జరిపిన దాడి ఒక “ఉగ్రవాద చర్య (Terrorist Act)” అని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రాసిక్యూటర్లు (UAE Procecuters) శనివారం ధృవీకరించారు. విమానాన్ని తన ఆధీనంలోకి తీసుకుని, దాన్ని కూల్చివేసేందుకు కో-పైలట్ (Co-Pilot) కుట్ర పన్నినట్లు అధికారులు వెల్లడించారు.
సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ బోయింగ్ 737 విమానం గాల్లో ఉండగా ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. విమానం సుమారు 34 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో కో-పైలట్ హమామ్ అల్ హమామీ తన ఉగ్ర ప్రణాళికను అమలు చేసేందుకు సిద్ధమయ్యాడు. కాక్‌పిట్‌లో ఉన్న ‘క్రాష్ యాక్స్’ తీసుకుని కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై దాడికి దిగాడు.
ఆ సమయంలో విమానం నియంత్రణ కోల్పోయి నిమిషానికి 23 వేల అడుగుల వేగంతో కిందకి పడిపోవడం ప్రారంభించింది. క్షణాల్లో 15,600 అడుగుల ఎత్తుకు చేరుకుంది. అయితే ప్రాణాపాయ స్థితిలోనూ కెప్టెన్ స్మిత్ అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించారు. కో-పైలట్‌తో పోరాడుతూనే కాక్‌పిట్ డోర్‌ను తెరిచారు. దాంతో విమాన సిబ్బంది, ప్రయాణికులు వెంటనే స్పందించి కో-పైలట్‌ను పట్టుకుని బంధించారు.
ఆ సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు పైలట్ల సాయంతో కెప్టెన్ స్మిత్ విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్ నగరంలో సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. కెప్టెన్ సమయస్ఫూర్తితో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై యూఏఈ అటార్నీ జనరల్ హమద్ సైఫ్ అల్ షమ్సీ ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. ఈ దాడి వెనుక ఉన్న ఉగ్రవాద సంబంధాలపై ప్రత్యేక బృందం విచారణ జరుపుతున్నది.
నిందితుడు హమామ్ అల్ హమామీ సొంత దేశమైన ఒమన్‌లోనే తీవ్రవాద భావజాలం కారణంగా విమానాలు నడపకుండా నిషేధానికి గురైనట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. చాలాకాలం సిరియాలో గడిపిన హమామ్, అక్కడ ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితుడై, ఆ తర్వాత యూఏఈకి వచ్చినట్లు తెలుస్తోంది. కేవలం 8 నెలల క్రితమే ఫ్లైదుబాయ్‌లో చేరిన హమామ్, అంతకుముందు ఒమన్ ఎయిర్, రాయల్ ఎయిర్ మరోక్ సంస్థల్లో పనిచేశాడు.
ఈ ఘటన జరిగిన కొన్ని గంటల ముందు అతని సోషల్ మీడియా ఖాతాల్లో ఉగ్రవాదానికి సంబంధించిన పోస్టులు కనిపించాయి. ఇజ్రాయెల్ విమానాన్ని జూమ్ చేస్తూ తీసిన వీడియో, అల్‌ఖైదా నాయకుడు అల్-జవహరీ చిత్రాలు, మక్కా, మదీనా, జెరూసలేం పవిత్ర స్థలాలతో కూడిన ఏఐ-జనరేటెడ్ చిత్రాన్ని పోస్ట్ చేయడం అతని ఉగ్రవాద ఆలోచనా విధానానికి అద్దం పడుతున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
KTR | కేటీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. వీడియో
SBI Data Leak | ఎస్బీఐపై సైబర్ దాడి.. డాటా లీక్.. ఖాతాదారులు ఏం చేయాలంటే
Asian Para Games: స్ప్రింటర్ సిమ్రన్ శర్మకు రెండో గోల్డ్ మెడల్
Bike Accident | అతివేగంతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

