Aman Sehrawat : ఆసియా క్రీడల (Asina Games) లో భారత రెజ్లర్ (Indian Wrestler) అమన్ శెహ్రావత్ (Aman Sehrawat) సంచలనం సృష్టించాడు. పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ (Mens 57 KG free style) ఫైనల్లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ (World Champion) హాన్ చోంగ్ సాంగ్ (Han Chong Song) ను 11-7 తేడాతో ఓడించి స్వర్ణ పతకం (Gold Medal) సాధించాడు. దాంతో ఈ విభాగంలో స్వర్ణం గెలిచిన తొలి భారత రెజ్లర్‌గా అమన్ చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం ఆసియా క్రీడల్లో భారత స్వర్ణ పతకాల సంఖ్య 20 కి చేరింది.
నగోయా సిటీ ఇనాయే స్పోర్ట్స్ సెంటర్లో జరిగిన ఫైనల్ హోరాహోరీగా సాగింది. రెండో భాగంలో అమన్ 6-1 ఆధిక్యంలో ఉన్నాడు. అయితే ఉత్తరకొరియా రెజ్లర్ పుంజుకున్నాడు. వరుస పాయింట్లతో 7-6 ఆధిక్యంలోకి వెళ్లాడు. సమయం ముగిసే దశలో అమన్ అద్భుతంగా పుంజుకున్నాడు. టేక్‌డౌన్‌తో రెండు పాయింట్లు సాధించి ఆ తర్వాత రోల్ ద్వారా మరో రెండు పాయింట్లు దక్కించుకున్నాడు. దాంతో 11-7 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లాడు. ప్రత్యర్థి ఆ పాయింట్లపై ఛాలెంజ్ చేసినా ఫలితం లేకపోయింది.
పైగా ఓ పాయింట్ కోల్పోవడంతో అమన్ ఆధిక్యం మరింత పెరిగింది. చివరి 30 సెకన్లలో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా స్వర్ణాన్ని ఖాయం చేసుకున్నాడు. అమన్‌కు ఇది ఆసియా క్రీడల్లో రెండో పతకం. 2023 హాంగ్జౌ క్రీడల్లో కాంస్యం సాధించిన అతడు ఇప్పుడు స్వర్ణం నెగ్గాడు. పారిస్ ఒలింపిక్స్‌లోనూ అమన్ కాంస్య పతకం గెలిచాడు. అమన్ ఫైనల్‌కు ముందు అద్భుతంగా రాణించాడు. తొలి రౌండ్లో జపాన్‌కు చెందిన యమటో ఒగావాను 20-9తో ఓడించాడు.
క్వార్టర్ఫైనల్లో కజకిస్థాన్‌కు చెందిన నుర్దానత్ ఐతానోవ్పై 12-1తో గెలిచాడు. సెమీఫైనల్లో తజికిస్థాన్ రెజ్లర్ అయాల్ బెలోల్యుబ్స్కీ పై గెలిచి ఫైనల్‌కు చేరాడు. ఇదే క్రీడల్లో పురుషుల 65 కేజీల ఫ్రీస్టైల్‌లో సుజీత్ కల్కల్ కూడా స్వర్ణం సాధించాడు.