Asian Games : ఆసియా క్రీడల్లో భారత ఫ్రీస్టియిల్ రెజ్లర్లు పతకాల వేట కొనసాగించారు. శనివారం దీపక్ పూనియా(Deepak Punia) చరిత్రాత్మక కాంస్యంతో మెరవగా.. కాసేపటికే మహిళా రెజ్లర్ అంతిమ్ పంఘాల్(Antim Panghal) వెండి పతకం సాధించింది. 53 కిలోల ఫైనల్లో జోరు చూపించలేక, ప్రత్యర్థి అయిన జపాన్ రెజ్లర్‌ను పడగొట్టలేక సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకుంది. ఆసియాడ్‌లో అంతిమ్‌కు ఇది రెండో పతకం కావడం విశేషం.
జపాన్‌లోని ఐచీ నగోయలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత రెజ్లర్ల పతక పోరు ముగిసింది. శనివారం కుస్తీలో దీపక్ పూనియా కాంస్యం సాధించగా, అంతిమ్ పంఘాల్ రజతం గెలిచింది. మహిళల 53 కిలోల విభాగంలో మొయీ కియూ(జపాన్)తో మ్యాచ్‌లో తొలి రౌండ్ నుంచి వెనకబడిన అంతిమ్.. ఏ దశలోనూ పుంజుకోలేదు. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో 1-9 ఓటమిపాలైన సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకుంది తను. మూడేళ్ల క్రితం హంగ్జౌలో కాంస్యంతో మెరిసిన అంతిమ్ ఈసారి మెరుగైన ప్రదర్శన చేసినా స్వర్ణాన్ని ముద్దాడలేకపోయింది.
🤼♂️ANTIM WINS THE ANTIM MEDAL IN WRESTLING
Antim Panghal lost to former World Champion Moe Kiyooka🇯🇵 1-9 to win SILVER🥈 in Women’s 53 kg.
Antim is the only Women’s wrestler to medal at this edition of Asian Games.
She has also upgraded the medal color from BRONZE in last… pic.twitter.com/IVWmhq4ex4
— SPORTS ARENA🇮🇳 (@SportsArena1234) October 3, 2026