Youth Attack | ఇద్దరు యువకులు ఫూటుగా గంజాయి సేవించారు. ఆ గంజాయి మత్తులో తమ తాము మరిచిపోవడమే కాదు.. ఎదురుగా ఎవరున్నారనే విషయాన్ని పట్టించుకోలేదు. ఇద్దరు యువకుల కుటుంబాల మధ్య గొడవ జరుగుతుందని ఘటనాస్థలానికి చేరుకున్నారు పోలీసులు. ఆ ఇద్దరు గొడవను ఆపేందుకు వచ్చిన పోలీసులపైనే దాడికి దిగారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సంతులాల్ పోడు తండాలో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. సంతులాల్ పోడు తండాకు చెందిన గుగులోత్ మంగీలాల్, బానోత్ భాస్కర్ కుటుంబాల మధ్యలో పాత కక్షలు ఉన్న క్రమంలో ఇరు కుటుంబాల మధ్యలో గొడవ జరిగింది. గొడవ కాస్తా తీవ్రమై ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో తండా వాసులు డయల్ 100కి కాల్ చేశారు.
వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు దాడిని ఆపేందుకు ప్రయత్నించారు. గంజాయి మత్తులో మంగీలాల్ కొడుకులు గుగులోత్ రవి, కుమార్ పోలీసులపై దాడికి దిగారు. దీంతో పోలీసులకు గాయాలయ్యాయి. కానిస్టేబుల్స్ ఫిర్యాదు మేరకు గుగులోత్ రవి, కుమార్, బానోత్ భాస్కర్, పద్మలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు.
గంజాయి మత్తులో పోలీసులపై దాడి చేసిన యువకులు.. పోలీసులకు గాయాలు
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సంతులాల్ పోడు తండాలో ఘటన
తండాకు చెందిన గుగులోత్ మంగీలాల్, బానోత్ భాస్కర్ కుటుంబాల మధ్యలో పాత కక్షలు ఉన్న క్రమంలో ఇరు కుటుంబాల మధ్యలో జరిగిన గొడవ
గొడవ తీవ్రమవడంతో ఒకరిపై ఒకరు దాడి… pic.twitter.com/LmuI5oKFmB
— Telugu Scribe (@TeluguScribe) March 29, 2026
Chennur | చెన్నూరులో దారుణం..టీచర్ల వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య?
Pakistani ships | ‘హర్మూజ్’ గుండా 20 పాక్ నౌకలకు అనుమతి.. శాంతికి సంకేతమన్న పాకిస్థాన్
Anakapalli Teaser | త్రిణాధరావు నక్కిన మార్క్ స్టోరీతో ‘అనకాపల్లి’.. ఆకట్టుకుంటున్న టీజర్