నాగర్‌కర్నూల్/అచ్చంపేట, జూలై 29 : నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండడం ఆయన నైజం.. నిరంతరం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పర్యటనలు.. అభివృద్ధే పరమావధిగా ప్రత్యేక దృష్టి సారించి.. తక్కువ సమయంలోనే అందరివాడిగా గుర్తింపు పొందారు.. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులకు సింహస్వప్నం.. సమర్థంగా.. నిబద్ధతతో పనిచేసే ఉద్యోగులకు వెన్నంటే నిలిచి.. జిల్లా పరిపాలనలో కొత్త ఒరవడిని తీసుకొచ్చారు.. ఆయనే 2019 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి.. నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్‌గా హేమంత్ కేశవ్ పాటిల్ ఈ ఏడాది ఏప్రిల్ 26న బాధ్యతలు చేపట్టి 90 రోజుల పరిపాలన మార్క్ అందుకున్నారు. ఆయన శైలిపై జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.. ఈ క్రమంలో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
జిల్లా అధివృద్ధి అనేది కేవలం సమీక్షలతో కాకుండా గ్రామాలు, పల్లెలు, తండాలు, ఆదివాసి గూడెంలకు వెళ్లి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడం ద్వారానే సాధ్యమనే నమ్మకంతో కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ విధులు నిర్వర్తిస్తున్నారు. గత 90 రోజులుగా దాదాపు ప్రతిరోజూ ఏదో ఒక గ్రామం.. మండలం.. ప్రభుత్వ కార్యాలయం.. పాఠశాల.. దవాఖాన.. అంగన్వాడీ కేంద్రం, గ్రామ పంచాయతీ.. ఇలా ప్రగతి పనులను స్వయంగా పరిశీలి స్తూ.. ప్రజా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిం చే దిశగా చర్యలు చేపడుతున్నారు. ఇలా జిల్లాలో ఏదో ఒక గ్రామం కలెక్టర్ పర్యటనకు వేదికగా మారుతోంది.
ముందస్తు సమాచారం లేకుండా క్షేత్రస్థాయిలోకి వెళ్లి అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించడం.. తనిఖీలు చేపట్టడం.. ప్రజల ను ంచి నేరుగా సమస్యలు తెలుసుకోవడం ఆయన దినచర్య. పనులు కాగితాలపై ఎలా ఉన్నాయో? కాకుండా.. నేల మీద ఎలా జరుగుతున్నాయో? చూసి అధికారులకు అక్కడికక్కడే సూచనలు ఇ వ్వడం వల్ల పరిపాలనలో వేగం పెరిగిందని అధికారులు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి హోదాలో ఉన్నా ఉపేక్షించబోమనే స్పష్టమైన సంకేతాలను కలెక్టర్ ఇస్తున్నారు. ఇప్పటికే వివిధ శాఖల్లో విధులపై అలసత్వం, నిర్లక్ష్యం, పరిపాలనా లోపాలు, అవినీతి ఆరోపణలు ఉన్న అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. పలువురికి షోకాజ్ నోటీసులు జారీ కావడం ఆయన పనితీరుకు అద్దం పడుతోంది. రెవెన్యూ, విద్య, వైద్య, పంచాయతీరాజ్ తదితర శాఖల్లో విధులుపై అలసత్వం వహించిన పలువురు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు.
డిప్యూటీ తాసీల్దా ర్ సస్పెన్షన్, ధరణి ఆపరేటర్ తొలగింపు, ఎంపీడీ వో, హెడ్మాస్టర్, ఎంఈవోలు, పంచాయతీ కార్యదర్శులు సస్పెన్షన్, అంగన్వాడీ టీచర్లు, ఆయాల తొలగింపు, ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు, ఇతర శాఖల అధికారులు, ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతోపాటు విద్య, వైద్యశాఖల్లో డిప్యూటేషన్లు రద్దు వంటి కీలక నిర్ణయాలు తీసుకొని క్రమ శిక్షణకు మారుపేరుగా నిలిచారు. మరోవైపు సమర్థంగా పనిచేసే అధికారులను అభినందించడం, ప్రోత్సహించడం ద్వారా ప్రభుత్వ యంత్రాంగంలో సానుకూల పోటీ వాతావరణాన్ని కూడా కల్పించారు.
ఈరోజు కలెక్టర్ ఎక్కడికి వెళ్తారు? ఏ శాఖను తనిఖీ చేస్తారు? ఎవరి పనితీరును సమీక్షిస్తారు? అనే చ ర్చలు, భయం జిల్లా అధికారుల్లో రోజువారి అం శంగా మారింది. కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు, పర్యటనలతో క్షేత్రస్థాయిలో ఉద్యోగుల్లో చలనం వచ్చిం ది. కలెక్టర్ ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటా రో? అన్న ఆందోళనతో ఉద్యోగుల్లో బాధ్యత పెరిగింది. ఫలితంగా పెండింగ్ ఫైళ్ల పరిష్కారం, అభివృద్ధి పనుల వేగవంతం, ప్రజల ఫిర్యాదులపై త్వ రగా స్పందన వంటి అంశాల్లో జిల్లా అధికార యం త్రాంగంలో మార్పు కనిపిస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఇంతకుముందు నెమ్మదిగా సాగిన ప నులు ఇప్పుడు వేగం అందుకుంటున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారులు సమయ పాలన పాటించడం, ప్రజల దరఖాస్తులపై స్ప ంది ంచడం, అభివృద్ధి పనుల నాణ్యతపై దృష్టి పెట్టడం అంశాల్లో మార్పు కనిపిస్తోందని చెబుతున్నారు.
ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వర కు ప్రజల సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ, అధికారులతో సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనలతో నిరంతరం బీజీగా ఉండే కలెక్టర్ పనితీరు జిల్లా ప్రజల్లో విశేష చర్చకు దారి తీ సింది. విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి, ప్రభు త్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడం, ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా అధికారులు ప్రజల వద్దకు వెళ్లే విధానాన్ని ప్రో త్సహించడం.. వంటి చర్యలు జిల్లాలో పరిపాలనలో కొత్త ఒరవడిని చూపిస్తున్నాయి.
తనను కలిసిన ప్రజల సమస్యలను ఓపికగా వినడం, అక్కడికక్కడే సంబ ంధిత అధికారులను పిలిపించి పరిష్కార మార్గాలు సూచించడం కలెక్టర్ ప్రత్యేకత.. అధికారులకు మాత్రమే కాకుండా ప్రజలకు కూడా ధైర్యం కలిగించే పరిపాలన కొనసాగుతుందని ప్రజ లు అభిప్రాయపడతున్నారు. సినిమాల్లో మాత్రమే కనిపించే చురుకైన పరిపాలనను ఇప్పుడు కందనూలులో ప్రత్యక్షంగా చూస్తున్నామని జిల్లా ప్రజలు చెబుతున్నారు. ముఖ్యంగా ఒకే ఒక్కడు సినిమాలో అవినీతిపై కఠిన చర్యలు తీసుకునే పరిపాలనా శైలి గుర్తుకు వస్తోందని పేర్కొంటున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లాగా ఉన్న నాగర్‌కర్నూల్‌ను అన్ని రంగాల్లో ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కలెక్టర్ తనతో పాటు మొత్తం జిల్లా యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు.
కలెక్టర్ అంటే ఇలా ఉండాలి.. ప్రజల మధ్యకు వ చ్చి సమస్యలు తెలుసుకోవాలి.. పనిచేయని అధికారులపై చర్యలు తీసుకోవాలి.. ప్రభుత్వ యంత్రా ంగాన్ని గాడిలో పెట్టే నాయకత్వం ఇదే.. అంటూ జిల్లా ప్రజలు హేమంత్ కేశవ్ పాటిల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉం టూ.. అభివృద్ధి పనులను వేగంవంతం చేస్తూ.. బాధ్యతాయుత పరిపాలనకు ప్రాధాన్యమిస్తున్న కలెక్టర్ గురించి చర్చ నడుస్తోంది. ఇదే స్ఫూర్తితో యంత్రాంగం పనిచేస్తే నాగర్‌కర్నూల్ జిల్లా
అభివృద్ధిలో మరింత ముందుకు వెళ్లే అవ కాశాలు ఉన్నా యని జిల్లావాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. శభాష్ కలెక్టర్ అన్న అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.