నాగర్ కర్నూలు : తెలంగాణ రైతాంగానికి న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పోరాటాలు ( BRS Fight ) చేస్తూనే ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) స్పష్టం చేశారు. ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా దేశిఇటిక్యాల గ్రామ శివారులో ఎండిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ ప్రాజెక్టులల్లో ( Projects ) పుష్కలంగా నీళ్లు ఉన్నా పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి ఆంధ్రాకు నీటిని వదిలి మన పంటలను ఎండబెడుతున్నారని మండిపడ్డారు.
ఇది ఎల్నినో తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ఇచ్చిన కరువు అని పేర్కొన్నారు.
పాలమూరు బిడ్డనని చెప్పుకుంటూనే, పాలమూరు రైతాంగాన్ని రేవంత్ నిలువునా ముంచేసిండు. కృష్ణా నదిలో పుష్కలంగా నీళ్లున్నా, మోటార్లు పెట్టి ఎత్తిపోయకుండా, తన గురువు చంద్రబాబు దగ్గర పిల్లిలా మారిపోయిండని విమర్శించారు. ఎల్ నినో ప్రభావం ఉందని తెలిసినా కాని పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి పంపులను పూర్తి స్థాయిలో ఎందుకు నడపడం లేదని ప్రశ్నించారు.