నర్సింహులపేట ఫిబ్రవరి 7 : నర్సింహులపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు సేవా కేంద్రం(Farmer service center) తెరుచుకోకపోవడంతో యూరియా కోసం వచ్చిన రైతులు(Farmers )వెలుదురుగాల్సిన పరిస్థితి శుక్రవారం నెలకొంది. వివిధ గ్రామాల నుంచి రైతులు యూరియా కోసం రావడంతో రైతు సేవా కేంద్రంలో ఉండాల్సిన సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఉదయం నుండి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్రైవేట్ ఫర్టిలైజర్ దుకాణంలో అధిక ధరకు యూరియా అమ్ముతుండడంతో ఎమ్మార్పీ ధరలకు యూరియా అమ్ముతున్న రైతు సేవా కేంద్రానికి ఆ రైతులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇలాంటి సమయంలో సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో రైతులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఇప్పటికైనా సమయపాలన పాటించి రైతులకు యూరియా అందుబాటులో ఉంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.