నెల్లికుదురు మార్చి 7 : 10 వ తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి(DEO Ravinder Reddy) అన్నారు. మండలంలోని ఆలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను డీఈవో శుక్రవారం సందర్శించారు. ఫ్రీ ఫైనల్ పరీక్షలకు సంసిద్ధులవుతున్న విద్యార్థులతో మాట్లాడారు. ఈసారి పదో తరగతి వార్షిక పరీక్షల్లో బుక్లెట్ ఇస్తున్నారని గుర్తు చేశారు.
బుక్లెట్లో పరీక్ష రాయడం సులభతరమని, సౌలభ్యంగా ఉంటుందని అన్నారు. పది ఫలితాల్లో జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపాలని తెలిపారు. ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా విద్యార్థులు పరీక్షలు రాయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈవో తో పాటు మండల విద్యాశాఖ అధికారి రాందాస్ ఉన్నారు.