మహబూబాబాద్, జూన్ 12: బడీడు పిల్లలను బడులు చేర్పించి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించాలని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ నాగవాణి అన్నారు. గురువారం మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ నుంచి నెహ్రూ సెంటర్ వరకు ప్రపంచ బాల కార్మికుల నిర్మూలన దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కోర్టు న్యాయమూర్తుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా నాగవాణి మాట్లాడుతూ.. బడి ఈడు పిల్లలను ప్రతి ఒక్కరిని బడిలో ఉండే విధంగా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని బాలలు చదువుకుంటేనే దేశ భవిష్యత్తు మంచిగా ఉంటుందని తెలిపారు. విద్యార్థులను పనులకు పంపకుండా బడులకు పంపించాలని అప్పుడే విద్యార్థులు శారీరకంగా మానసికంగా ఉల్లాసంగా ఉంది ప్రగతికి దోహదపడతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయవాదులు ఐసీడీఎస్ సిబ్బంది అంగన్వాడీ టీచర్లు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.