మహబూబాబాద్: సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిపై సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ నియంతృత్వ వైఖరిని ఖండిస్తూ మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. అసెంబ్లీ సాక్షిగా ప్రజల తరఫున ప్రశ్నిస్తున్న ప్రజా గొంతుకైన మాజీ జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్‌ను తీవ్రంగా కండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మర్నేని వెంకన్న, తెల్ల శ్రీనివాస్, లునవత్ అశోక్, జెర్రిపోతుల వెంకన్న గౌడ్, నాయిని రంజిత్, మర్నేని రఘు, ఎండీ సలీం, దాసరి రవిష్, నీలేష్ రాయ్, బొడ లక్ష్మణ్, మానాది రాజేష్, బాణోత్ రాము నాయక్, పుచ్చకాయల రామకృష్ణ, ప్రసాద్, అమీర్ ఖాన్, అంజి, ప్రశాంత్ నవీన్, ఉదయ్, అజయ్, మురళి, వివేక్ తదితరులు పాల్గొన్నారు.