హనుమకొండ (ఐనవోలు) : నిరుపేదలకు కాకుండా కాంగ్రెస్ నాయకులకే ఇందిరమ్మ ఇండ్లలలో ప్రధాన్యం కల్పించడాన్ని బీజేపీ మండలాధ్యక్షుడు మదాసు ప్రణయ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇందిరమ్మ ఇండ్లలో పారదర్శకత పాటించి ఇండ్లు లేని పేద, నిరుపేదలకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లను అర్హులకు ఇవ్వకపోతే అర్హులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి గుండెకారి కోటేశ్వర్రావు, జిల్లా కోశాధికారి బొల్లెపల్లి మహేశ్వర్ గౌడ్, మండల కార్యదర్శి పొన్నాల రాజు, ఉపాధ్యక్షులు నరిగే రాజేశ్, గూబ దేవేందర్, పులి సాగర్, సూదుల రవీందర్రెడ్డి, ఆడెపు భాస్కర్, కోట నర్సయ్య, కిసాన్ మోర్చ మండలాధ్యక్షుడు పాక కుమారస్వామి, తాళ్లపల్లి వెంకటనారాయణ, కోట కిరణ్ తదితరులు పాల్గొన్నారు.