సుబేదారి, అక్టోబర్ 17 : దసరా పండుగ ఆబ్కారీ శాఖకు కాసులు కురిపించింది. ఈ ఏడాది మద్యం విక్రయాలు ఘననీయంగా పెరిగాయి. పండుగకు రెండు రోజుల ముం దు నుంచి మందుబాబులు మద్యం షాపుల వద్ద బారులు తీరారు. వైన్స్‌లు, బార్లు కిటకిటలాడాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం రూ.120 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఆబ్కా రీ శాఖ అధికారులు తెలిసారు. మొత్తం 294 వైన్స్, 60 బార్‌షాపుల్లో 5,01,883 బీర్ కేసులు, లిక్కర్ 2,64,553 కేసులు అమ్ముడు పోయినట్లు చెప్పారు.