కరీమాబాద్ ఏప్రిల్ 8 : ఈ నెల 27న జరుగుతున్న బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను జయప్రదం చేయాలని రైతు సమన్వయ సమితి వరంగల్ జిల్లా మాజీ అధ్యక్షురాలు ఎల్లావుల లలిత యాదవ్ అన్నారు. మంగళవారం 43వ డివిజన్ వినయ్ గార్డెన్, నాయుడు పంపు వద్ద నిర్వహించిన సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సిల్వర్ జూబ్లీ వేడుకలకు డివిజన్ లోని ప్రతి కాలనీ నుండి పెద్ద సంఖ్యలో తరలించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Hardik Pandya | టీ20ల్లో పాండ్యా వరుస రికార్డులు.. భారత్ నుంచి ఒకేఒక్కడు
Mallikarjun Kharge | ఆరెస్సెస్ సిద్ధాంతాలు పటేల్ భావజాలానికి వ్యతిరేకం : మల్లికార్జున్ ఖర్గే