Hardik Pandya : ఐపీఎల్ 18వ సీజన్లో హార్దిక్ పాండ్యా(Hardik Pandya) ఆల్రౌండర్ షోతో అదరగొడుతున్నాడు. బ్యాటుతో, బంతితో విధ్వంసం సృష్టిస్తూ వరుసగా రికార్డులు నెలకొల్పుతున్నాడు. మొన్నటికి మొన్న 5 వికెట్లు తీసి టీ20ల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన పాండ్యా.. ఈసారి ఆల్రౌండర్ విభాగంలో చెక్కుచెదరని రికార్డు సాధించాడు. పొట్టి క్రికెట్లో 5వేల పరుగులు బాదడమే కాకుండా 200లకు పైగా వికెట్లు పడగొట్టాడీ ముంబై ఇండియన్స్(Mumbai Indians) సారథి. తద్వారా ఈ ఘనతకు చేరువైన తొలి భారత క్రికెటర్గా గుర్తింపు సాధించాడు పాండ్యా.
వాంఖడేలో రాయల్ ఛాలెంజర్స్తో జరిగిన మ్యాచ్లో పాండ్యా రెచ్చిపోయాడు. తొలుత బంతితో విజృంభించిన అతడు ఒకే ఓవర్లో విరాట్ కోహ్లీ, లియాం లివింగ్స్టోన్లను పెవిలియన్ పంపాడు. అనంతరం 222 పరుగుల ఛేదనలో 99కే 4 వికెట్లు పడిన దశలో ముంబై కెప్టెన్ ఖతర్నాక్ ఇన్నింగ్స్ ఆడాడు. ఓటమి ఖాయమనుకున్న దశలో తిలక్ వర్మతో కలిసి బౌండరీలతో విరుచుకుపడ్డాడు.
Hardik Pandya becomes the first Indian and the 12th player overall to complete 5,000 runs and 200+ wickets in T20 cricket history.
5,000+ runs & 200+ wickets in T20s
(Runs & Wickets)
• Ravi Bopara (9,486 & 291) 🏴
• Samit Patel (6,673 & 352) 🏴
• Shane Watson (8,821 & 216)… pic.twitter.com/oAeHQ2aCAs— All Cricket Records (@Cric_records45) April 8, 2025
87 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పిన పాండ్యా 42 పరుగులు చేసి ఔటయ్యాడు. దాంతో, టీ20ల్లో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్న పాండ్యా.. బౌలర్గా 200 వికెట్ల క్లబ్లో చేరి రికార్డు సృష్టించాడు. అయితే.. అతడు రాణిస్తున్నా సరే ముంబై మాత్రం ఒకే ఒక విజయంతో సరిపెట్టుకుంది. వరుస ఓటములతో అట్టడుగున నిలిచిన మాజీ ఛాంపియన్ ప్లే ఆఫ్స్ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంది.