Rajiv Yuva Vikasam | మణికొండ, ఏప్రిల్ 8 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం కోసం నిరుద్యోగ యువతి, యువకులు నుంచి దరఖాస్తులు కోరుతున్నామని నార్సింగి మున్సిపల్ కమిషనర్ టి కృష్ణమోహన్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులు స్వీకరణ ఈనెల 14వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. అభ్యర్థుల యొక్క వయస్సు 21 సంవత్సరాలు నుండి 60 సంవత్సరాల వరకు ఆమోదిస్తామన్నారు.
1. ఆధార్ కార్డు
2. రేషన్ కార్డ్/ ఆధాయ ధ్రువీకరణ పత్రం
3. కుల ధృవీకరణ పత్రం ( తెలంగాణ ప్రభుత్వం ద్వారా జారీ చేసి ఉండాలి)
4. శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ ( రవాణా రంగ పథకం కోసం)
5. పట్టాదార్ పాస్ బుక్ ( వ్యవసాయ పథకం కోసం)
6. సదరం సర్టిఫికెట్లు ( PWDs)
7. పాస్పోర్ట్ సైజ్ ఫోటో.. ఆసక్తి గలవారు మీసేవ కేంద్రాలు, ప్రజాపాలన సేవ కేంద్రాలు ( పురపాలక సంఘ కార్యాలయం) లలో దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ తెలిపారు.