Tamannah Bhatia | మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఓదెల 2 (Odela 2). 2021లో విడుదలైన “ఓదెల రైల్వే స్టేషన్” సినిమాకు సీక్వెల్గా ఈ సినిమా రాబోతుంది.
సూపర్నాచురల్ థ్రిల్లర్గా రాబోతున్న ఈ సినిమాకు టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది (Sampath Nandi) కథను అందిస్తుండగా.. అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ ట్రైలర్ చూస్తుంటే.. మొదటి భాగం కొనసాగింపుతో ఈ సినిమా రాబోతున్నట్లు అర్థమవుతుంది. తమన్నా ఇందులో నాగ సాధువుగా నటిస్తుంది. మధు క్రియేషన్స్ మరియు సంపత్ నంది టీమ్వర్క్స్ బ్యానర్లపై డి. మధు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.