హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 5 : కాకతీయ విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ పదవిని మరొక సంవత్సర కాలానికి పొడిగిస్తూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు రాజేందర్ పదవిలో మరో సంవత్సరం కొనసాగనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయంలోని బోధన, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు రాజేందర్‌ను అభినందించారు.
ఇవి కూడా చదవండి..
DGCA | విమానాల రద్దు వేళ డీజీసీఏ కీలక నిర్ణయం.. పైలట్ల విధులపై ఆంక్షలు సడలింపు
Maoist Party | హిడ్మాది హత్య.. మారేడుమిల్లి ఎన్కౌంటర్ ఒట్టి బూటకం.. లేఖ విడుదల చేసిన మావోయిస్టులు
Shah rukh Khan | ప్రపంచ వేదికపై DDLJ.. హ్యారీ పోటర్, బ్యాట్‌మాన్ పక్కన షారుఖ్, కాజోల్ విగ్రహం!