Shah rukh Khan | భారతీయ సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచిన ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’ (DDLJ) చిత్రం విడుదలై ఇటీవలే 30 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్రానికి అరుదైన గౌరవం లభించింది. ఈ సినిమాలోని ప్రధాన పాత్రలైన రాజ్ (షారుఖ్ ఖాన్), సిమ్రాన్ (కాజోల్) ల కాంస్య విగ్రహాన్ని లండన్‌లోని ప్రఖ్యాత లీసెస్టర్ స్క్వేర్‌లో ఆవిష్కరించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా వచ్చిన షారుఖ్ ఖాన్, కాజోల్ తమ చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడమే కాకుండా తమ ఐకానిక్ ఫొజులతో వైరల్‌గా నిలిచారు.
విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం షారుఖ్ ఖాన్ తనదైన శైలిలో స్పందిస్తూ.. “బడే బడే దేశోం మే, ఐసీ చోటీ చోటీ బాతేఁ హోతీ రెహతీ హైఁ, సెనోరిటా!” (పెద్దపెద్ద దేశాల్లో ఇలాంటి చిన్న చిన్న విషయాలు జరుగుతూనే ఉంటాయి, సెనోరిటా!) అంటూ ఈ సినిమాలోని తన ఫేమస్ డైలాగ్‌ను కొట్టాడు. మరోవైపు లండన్‌లోని ‘సీన్స్ ఇన్ ది స్క్వేర్’ (Scenes in the Square) ట్రైల్లో చోటు దక్కించుకున్న మొట్టమొదటి భారతీయ చిత్రంగా DDLJ నిలిచింది. ఈ కార్యక్రమానికి కాజోల్ తన పిల్లలు నైసా, యుగ్ లతో కలిసి హాజరయ్యింది.
#ShahRukhKhan and #Kajol unveil a #DDLJ pose bronze sculpture in London’s Leicester Square.#Celebs pic.twitter.com/ymbeNCrlmS
— Filmfare (@filmfare) December 4, 2025