, మే 13(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ చరిత్రలోనే అత్యంత భారీ సభగా ఎలతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ నిలిచిపోతుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పకడ్బందీ ప్రణాళిక, క్రమశిక్షణ, ప్రజల్లో బీఆర్ఎస్పై ఉన్న అంతులేని అభిమానానికి ఎలతుర్తి బహిరంగ సభ నిదర్శనమని చెప్పారు. ఎలతుర్తి సభ తర్వాత రాష్ట్ర రాజకీయాల దిశ మా రిందని స్పష్టం చేశారు. రజతోత్సవ మహాసభ విజయానికి కారణమైన ప్రతి కార్యకర్తకు, నేతకు కృతజ్ఞతలు తెలిపారు.
బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ విజయవంతమైన నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో కేటీఆర్ మంగళవారం ప్రత్యేకంగా సమావేశమయ్యా రు. సభ నిర్వహణలో భాగస్వాములైన నేతలతో కలిసి కేటీఆర్ భోజ నం చేశారు. బీఆర్ఎస్ 25 సంవత్సరాల సంబురాన్ని వరంగల్ గడ్డపై నిర్వహించే అవకాశం ఇచ్చినందుకు వరంగల్ నేతలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. అన్ని విషయాల్లో తమకు దిశానిర్దేశం చేసిన వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సభ విజయవంతంగా నిర్వహించిన అనుభవాలను పంచుకున్నారు. ప్రజల్లో కాంగ్రెస్‌పై ఉన్న వ్యతిరేకతకు అనుగుణంగా పార్టీ కార్యక్రమాలు రూపొందించుకోవాలని సూచించారు.
‘ఇప్పుడైనా, ఎప్పుడైనా రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువు బీఆర్ఎస్సే. బీఆర్ఎస్ ఎల్కతుర్తి సభ తర్వాత ప్రజల్లోనూ, కార్యకర్తల్లోనూ ఒక అనుకూల శక్తి వచ్చింది. కాంగ్రె స్ పార్టీ అరాచకాలపై అలుపెరగని పోరాటం చేసే ఉత్సాహం కలిగింది. ఏనాటికై నా తెలంగాణకు, ప్రజలకు బీఆర్ఎస్సే శ్రీరామరక్ష అనే స్పష్టత ఎల్కతుర్తి సభతో మరోసారి నిరూపితమైంది’ అని కేటీఆర్ అన్నా రు. ప్రజాపాలన పేరుతో అధికారంలో వచ్చి ప్ర జలను అరిగోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభు త్వ అంతానికి ఆరంభం మొదలైందని కేటీఆర్ అన్నారు.
అధికారంలోకి వచ్చిన ఒక ఏడాదిలోనే ప్రజ ల్లో ఇంత వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వాన్ని తాను ఇప్పటివరకు చూడలేదని చెప్పారు. అనుభవలేమి, మోసం, అత్యాశ, అందినకాడికి దోచుకోవ డం లాంటి లక్షణాలు పుషలం గా ఉన్న రే వంత్ సరార్తో తెలంగాణ అభివృద్ధి రెండు దశాబ్దాలు వెనకి పోయిందని అన్నారు. రైతుల ఆత్మహత్యలు, వారి సమస్యల పరిషారంపై రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ విస్తృత పోరాటాలు చేస్తున్నదని చెప్పారు.
రైతుభరోసా చెల్లింపులు సక్రమంగా జరగకపోవడం, ధాన్యం కొనుగోళ్లలో సర్కారు నిర్ల క్ష్యాన్ని, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా బీఆర్ఎస్ కార్యాచరణ ఉండబోతున్నదని వివరించారు. నిరుద్యోగులకు మాట ఇచ్చినట్టుగా నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో పాటు ఇటీవల వెలుగుచూసిన ఉద్యోగ ని యామకాల్లో అవకతవకలపై సమగ్ర వ్యూ హంతో ప్రజా ఉద్యమాలను ప్రారంభిస్తామని చెప్పారు. మోసానికి మారుపేరైన కాం గ్రెస్ నైజాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామ ని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలును ఎలా విస్మరించిందో ప్రజలకు వివరిస్తామని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ మోసాల్ని, అవినీతిని ప్రజల్లో బయటపెడతామన్నారు. ప్రజలను మోసం చేస్తూ, వేధిస్తుంటే ఊరుకునేది లేదని, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పోరాటాలకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నదని స్పష్టం చేశారు. సమావేశంలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, శాసనమండలి డిప్యూటీ చైర్మ న్ బండా ప్రకాశ్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, పొన్నాల లక్ష్మయ్య, డీఎస్ రెడ్యానాయక్, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్‌కుమార్, మాలోత్ కవిత, మాజీ ఎ మ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, వొడితల సతీశ్‌కుమార్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, బానోత్ శంకర్‌నాయక్, గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ చైర్మన్లు గండ్ర జ్యోతి, సు ధీర్కుమార్, అంగోత్ బిందు, నాగుర్ల వెంకటేశ్వర్లు, కే వాసుదేవారెడ్డి పాల్గొన్నారు.