నేడు కేటీఆర్ రాక
మున్సిపల్ ఎన్ని కల ప్రచారంలో భాగంగా ఆదివారం ఓరుగల్లుకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు రానున్నారు. నర్సంపేట, వర్ధన్నపేటలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. అబద్ధపు హామీలతో గద్దె నెక్కిన కాంగ్రెస్ సర్కారు మోసం చేసిన తీరును ఆయన ఎండగట్టనున్నారు.
- నర్సంపేట, వర్ధన్నపేటలో ఎన్నికల ప్రచారం
- కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
- విజయవంతం చేయాలని గులాబీ నాయకుల పిలుపు
మహబూబాబాద్, ఫిబ్రవరి 7(నమస్తే తెలంగాణ)/నర్సంపేట/వర్ధన్నపేట : మున్సిపల్ ఎన్ని కల ప్రచారంలో భాగంగా ఆదివారం ఓరుగల్లుకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు రానున్నారు. నర్సంపేట, వర్ధన్నపేటలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. అబద్ధపు హామీలతో గద్దె నెక్కిన కాంగ్రెస్ సర్కారు మోసం చేసిన తీరును ఆయన ఎండగట్టనున్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ.. కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అన్యాయాలు, అవినీతిని ప్రశ్నిస్తూ ఓట్లను అభ్యర్థించనున్నారు.
నర్సంపేట నుంచి ప్రారంభం
ఉదయం 11 గంటలకు నర్సంపేటలోని వరంగల్ రోడ్డు నుంచి పాకాల రోడ్డు వరకు రోడ్‌షోలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మాజీ ప్రజాప్రతినిధు లు విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కోరారు. సాయంత్రం 4 గంటలకు కేటీఆర్ వర్ధన్నపేటలో రోడ్‌షో నిర్వహించి అంబేద్కర్ సెంటర్లో కార్నర్ మీటింగ్‌లో మా ట్లాడనున్నారు. సమావేశానికి ప్రతి వార్డు నుంచి 500ల మందికి తగ్గకుండా తరలించాలని మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ కోరారు.
మానుకోటలో రోడ్డు షోకు అనుమతి నిరాకరణ
మానుకోటలో కేటీఆర్ రోడ్డు షోకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అదే సమయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే ముర ళీనాయక్కు సంబంధించిన కార్నర్ మీటింగ్‌లు ఉన్నాయని పర్మిషన్ ఇవ్వలేదు. ఈనెల 9న మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య మీటింగ్ నిర్వహించుకునేందుకు అనుమ తిచ్చారు. అయిన్నప్పటికీ కేటీఆర్ ప్రోగ్రాం అధికా రికంగా ఖరారు కావాల్సి ఉంది.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
Ramayana | ‘రామాయణ’ రన్‌టైమ్ 3 గంటల 15 నిమిషాలా .. సినిమా నిడివిపై ఆసక్తికర ప్రచారం!
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

