Konda Surekha | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, KUDA ఛైర్మెన్ గుండు సుధారాణికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. తన అనుచరులతో కలిసి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ.. రెండు రోజుల్లో ఊడిపోయేటోడు ఒకరున్నరు.. నిన్న కాక మొన్న ఎక్కినోడు ఒకరున్నరు. నిన్న కాక మొన్న ఎక్కినోళ్లు అసలైనోళ్లా.. లేదా డూప్లికేటా మీరు ఆలోచించుకోవాలి. ఇంకోసారి మా ముందు కుప్పిగంతులేస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు.
కాంగ్రెస్ నాయకులు నోరు హద్దులో పెట్టుకొని మాట్లాడాలి.. నోరు జారి ఎవరినైనా ఏమైనా అంటే మాత్రం ఎక్కడ దొరికితే అక్కడ చిత్తు చిత్తులెక్క కొట్టి వదిలిపెడ్తరు. మిమ్మల్ని కొట్టాలంటే మగవాళ్లు అవసరం లేదు. ఆడవాళ్లే కొడ్తరు.. మా వెనక నిలబడ్డ మహిళలు చాలు.. ఒక్కక్కరు నలుగురిని కొడ్తరు. అంత దమ్ము ధైర్యం ఉన్నోళ్లున్నరు. ఇప్పటికైనా నోరు దగ్గర పెట్టుకోండి. ఇకముందు కొండా దంపతులకు సంబంధించిన వ్యక్తుల మీద ఈగ వాలినా ఊరుకునేది లేదని తెలియజేస్తున్నానని కొండా సురేఖ హెచ్చరించారు.
కాంగ్రెస్ నాయకులు నోరు హద్దులో పెట్టుకొని మాట్లాడాలి
నోరుజారి మాట్లాడితే మహిళలతో ఎక్కడ దొరికితే అక్కడ కొట్టిస్తాము
నా వెనక నిలబడ్డ మహిళలు ఒక్కొకరు నలుగురిని కొడతారు
మా ముందు కుప్పి గంతులు వేస్తే అడోళ్ళతో కొట్టిస్తా
కాంగ్రెస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, KUDA ఛైర్మెన్ గుండు… https://t.co/fTrXMhwESW pic.twitter.com/twW2gvMnDI
— Telugu Scribe (@TeluguScribe) September 29, 2026
Allu Arjun | భార్యతో అల్లు అర్జున్ రొమాంటిక్ మూమెంట్.. స్నేహారెడ్డికి బన్నీ స్పెషల్ విషెస్ వైరల్!
Srinivas Reddy | ప్రజలవిశ్వాసమే.. జర్నలిస్టులకు రక్షణ.. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
కడు పేదరికం నుండి యువ ద్రోణాచార్యుడిగా పొన్నాల పృథ్వీరాజ్